Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాంనగర్
దేశ ప్రజల సంపదను అక్రమంగా దోచుకున్న కార్పొ రేట్ల సంపదను జాతీయం చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర అధ్యక్షులు జాన్ వెస్లి డిమాండ్ చేశారు. సోమవారం మహానీయుల జయంతో త్సవాల కార్యక్రమం కొనసాగింపులో భాగంగా రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించాలని, ప్రభుత్వ రంగ సం స్థల ప్రయివేటీకరణ నిలిపిపి వేయాలని కోరుతూ గోల్కొ ండ క్రాస్ రోడ్డు నుంచి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వరకూ నీలి దండు కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమ ంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జాన్ వెస్లీ మాట్లాడుతూ.. కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఏప్రిల్ నెల మొత్తం గ్రామ గ్రామా న ఫూలే అంబేద్కర్ సందేశ యాత్రలు నిర్వహిస్తూ ప్రజల ను చైతన్యం చేస్తున్నట్లు తెలిపారు. కేంద్రంలో బీజేపీ అధి కారంలోకి వచ్చిన తర్వాత రాజ్యంగా సంస్థల్ని నిర్వీర్యం చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరించడంవల్ల రిజర్వేషన్లు నిరుపయోగంగా మారిపోతున్నాయన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ సంపదను కార్పొరేట్ సంస్థల పరం చేసేలా చట్టాలను సవరిస్తున్నారని, రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలు తెస్తూ.. ఎస్సీ ఎస్టీల హక్కులను కాలరా స్తున్నారని విమర్శించారు. విద్యను ప్రయివేటుపరం చేస్తూ ఆధునిక మన ధర్మాన్ని అమలు చేస్తున్నారని వాపోయారు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంవల్ల నిరు ద్యోగ సమస్య విపరీతంగా పెరిగి పోతోందని ఆవేదన వ్య క్తం చేశారు. ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ అమలు చేయలేదని అన్నా రు ప్రతిరోజూ దేశంలో ఎక్కడో ఒకచోట దళితుల మీద దాడులు జరుగుతున్నాయని తెలిపారు. టీఆర్ఎస్ దళితు లకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా, కుల వివక్ష రూపుమాపడానికి ఎలాంటి కార్యక్రమాలూ చేపట్టడం లేదని పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్‌కు సంబంధించిన రూ. 35 వేలకోట్ల నిధులు దారి మళ్లించారని తెలిపారు. సామాజిక న్యాయం సమాధి చేసేవారికి ఫూలే, అంబేద్కర్ స్మరించే హక్కు లేదన్నారు. కార్యక్రమంలో టీవీఎస్ నగర అధ్యక్ష, కార్యదర్శులు యాదగిరి, కొమ్ము విజరు కుమార్, నగర నాయకులు దశరథ్, జి. రాములు, నారాయణ, విష్ణుమూర్తి, శంకర్, కష్ణ, యాదయ్య, పవన్ పాల్గొన్నారు.