Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉప్పల్
అర్హులందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు వెంటనే ఇవ్వాలని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రామంతపూర్‌లోని రాజేంద్రనగర్ చౌరస్తా, విశాల్ మార్ట్, వివేక్‌నగర్, ఇంద్రానగర్‌లలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మేడ్చల్ జిల్లా నాయకులు కోమటిరెడ్డి మాట్లాడుతూ పేదవాడికి గూడు కలగానే మిగిలిపోయిం దన్నారు. టీఆర్ఎస్ అధికారం చేపట్టి ఆరేండ్లు గడిచినప్ప టికీ అర్హులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇప్పటికీ ఇవ్వక పోవడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతు న్నారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల అధిక ధరలు పెరగడం తోపాటు కొవిడ్ మహమ్మారి బారిన పడి ఉన్న ఉద్యోగా లను కోల్పోయి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొం టున్నారని తెలిపారు. పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించలేక ఏం చేయాలో అర్థం కాక అయోమయ పరిస్థితిలో ఉన్నా రని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎండీ గౌస్, వెంకటేశ్వర్లు, రాఘవ, యేసు డీవైఎఫ్ఐ శ్రీనివాస్ దయానంద్, ఆటో యూనియన్ నాయకులు యాదగిరి, పురుషోత్తం, ఆటో యూనియన్ నాయకులు సుమారు 30 మంది పాల్గొన్నారు.