Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టాయిలెట్ల నిర్వహణ అస్తవ్య స్తంగా ఉంది. అందుకు జీహెచ్ఎంసీ నిర్మించిన టాయిలెట్లను పగులగొట్టి మెటీరియల్‌ను ఎత్తుకెళ్లిన సంఘటనే నిదర్శనం. దీంతోపాటు కోట్ల రూపాయలు ఖర్చుచేసి నిర్మించినవాటిని సైతం వదిలేశారు. నిత్యం వివిధ పనులు, విధుల నిమిత్తం నగరంలో ప్రయాణించే వారి సౌకర్యార్థం జీహెచ్ఎంసీ పరిధిలో 10,200 పబ్లిక్ టాయిలెట్లను నిర్మించినట్టు అధికారులు చెబుతున్నారు. కానీ ఎక్కడా పూర్తిస్థాయిలో నిర్మించలేదు. పూర్తయిన వాటిని సైతం ప్రారంభించలేదు. ప్రారంభించినవాటి నిర్వహణలేక మళ్లీ మూసేస్తున్నారు.
కోటి జనాభాకు 10 వేలు
స్వచ్ఛ భారత్ నిబంధనల ప్రకారం ప్రతీ 1000 మందికి ఒక టాయిలెట్ అందుబాటులో ఉండాలి. గ్రేటర్ హైదరాబాద్‌లో కోటి జనాభా ఉంటుందని అధికారుల అంచనా. ఈ లెక్క ప్రకారం 10 వేల పబ్లిక్ టాయిలెట్లు అవసరముంది. అయితే జీహెచ్ఎంసీ పరి ధిలో ఆయా సంస్థల ఆధ్వర్యంలో బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్(బీఓటీ) పద్ధతిలో నడుస్తున్న రెండువేల టాయిలెట్లు ఉన్నాయి. మరో 8 టాయిలెట్లకుగాను లూ కేఫ్ ఆధ్వర్యంలో 1000 టాయిలెట్లు, బీఓటీలో మరో 1000 టాయిలెట్లను ఏర్పాటు చేయాలని జీహెచ్ ఎంసీ నిర్ణయించింది. సుమారు రూ.100 కోట్లకుపైగా ఖర్చుచేసి టాయిలెట్లను నిర్మించారు.
నిర్వహణకు రూ.25 కోట్లు
జీహెచ్ఎంసీ పరిధిలోని బీఓటీ, లూకేఫ్ ఆధ్వర్యంలో నిర్వహి స్తున్న టాయిలెట్లు మినహా మిగిలిన పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణకు నెలకు రూ.2 కోట్ల చొప్పున ఏడాదికి సుమారు రూ.25 కోట్లు ఖర్చు అవుతాయని అధికారులు అంచనా వేశారు. 20 పబ్లిక్ టాయిలెట్లను కలిపి ఒక క్లస్టర్‌గా ఏర్పాటుచేసి, ప్రయివేట్ ఏజెన్సీకి ఇవ్వాలని, ఈ క్లస్టర్లో ఉన్న మరుగుదొడ్లను ప్రతిరోజూ ఐదు విడతలు నిర్దేశిత సమయాల్లో పరిశుభ్రం చేయడానికి ప్రయివేట్ ఏజెన్సీకి అప్పిగిస్తామని గొప్పలు చెప్పారు. కానీ ఆచరణలో అం దుకు విరుద్ధంగా ఉంది. బాగ్‌లింగంపల్లి భగత్‌సింగ్‌నగర్ బస్తీలో నిర్మించిన టాయిలెట్లను నిర్మించి మూసేశారు. అదే ప్రాంతంలోని నాలాపై ఇరువైపులా ఏర్పాటు చేసిన టాయిలెట్లు అధ్వాన్నంగా ఉన్నాయి. వాటి సైజు చిన్నదిగా ఉండడంతో ఎవరైనా ఊబకాయ స్థులు వెళ్లలేని పరిస్థితి ఉంది. పైగా వాటిని మరమ్మతుల పేరుతో మూసేశారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ టాయిలెట్ల నిర్వహణ ఇలానే ఉంది. అయితే టాయిలెట్ల నిర్వహణపై పర్యవేక ్షణ కరువైంది. గతంలో టాయిలెట్ల నిర్వహణ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని శానిటేషన్ విభాగం ఆధ్వర్యంలో పర్యవేక్షించే వారు. కానీ జోనల్, సర్కిల్ స్థాయిలో ఇవ్వడంతో ఎక్కడ టాయిలెట్ ఉంది? ఎన్ని టాయిలెట్లు ఉన్నాయి? వాటిని ఎవరు నిర్వహిస్తున్నారు? అనేది ప్రశ్నార్థకంగా మారింది. నగరంలోని ఆయా ప్రాంతాల్లో టాయిలెట్ల వివరాలు ఇలా ఉన్నాయి.
టాయిలెట్ల వివరాలు ఇలా..
టాయిలెట్ల కేటగిరి సంఖ్య
బీఓటీ (బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్) 255
లూకేఫే 109
పీఎఫ్‌టీ (ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్) 844
ఈ-టాయిలెట్ 43
సులబ్ కాంప్లెక్స్ 10
బయోటాయిలెట్ 159
ట్విన్ బయోటాయిలెట్ 216
బయో ఎఫ్ఆర్జీ 30
సివిల్ 53
ఎఫ్ఓబీ 13
ఎఫ్ఆర్జీ 64
ఎఫ్ఆర్పీ (పైబర్ రీయిన్‌ఫోర్స్‌డ్ ప్లాస్టిక్) 30
మాడ్యులర్ 30
మైల్డ్ స్టీల్ క్యాబిన్స్ 226
ఆర్సీసీ 87
టాటా నెస్ట్ మాడ్యూలర్ టాయిలెట్స్ 110