Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
స్నేహితులను చూసిన ఓ నైజీరియన్ తాను మోసం చేసి డబ్బులు సంపాదించాని మోసాలకు తెగబడ్డాడు. బాధితుల ఫిర్యాదుతో రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసుల నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడి నుంచి ఐదు సెల్ఫోన్లు, చెక్‌బుక్స్, డెబిట్స్కార్డులు, పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నారు. సోమవారం రాచకొండ పోలీస్‌కమిషనర్ మహేష్‌భగవత్ తెలిపిన వివరాల మేరకు నైజీరియా దేశానికి చెందిన అల్బర్ట్ ఎమ్కా క్రిస్టఫర్ బట్టల వ్యాపారం పేరుతో 2010లో భారత్‌కు వచ్చాడు. కర్నాటకాకు చెందిన ఓ అమ్మాయిని పెండ్లిచేసుకుని వెస్టు ఢిల్లీలోని ఉత్తమ్ నగర్లో నివాసముంటున్నాడు. బట్టల వ్యాపారాన్ని నిర్వహిస్తున్న ఇతని దుకాణానికి నైజీరియన్స్, సైబర్ నేరగాళ్లు వచ్చి డబ్బులను పీఓఎస్ మిషఫన్లో స్వైఫ్ చేసుకునేవారు. అందుకు 5శాతం కమీషన్ తీసుకునేవాడు. వారిని గమనించిన క్రిస్టఫర్ తానుకూడా మోసాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా సోషల్‌మీడియాలో ఫ్రెండ్స్ రెక్వెస్ట్ పంపించేవాడు. స్పందించిన వారికి గిఫ్ట్‌లు పంపిస్తున్నానని నమ్మించేవాడు. ఆ తర్వాత ఢిల్లీ ఏయిర్ పోర్టు నుంచి కస్టమ్స్ అధికారిగా మాట్లాడి గిఫ్ట్‌లు వచ్చాయని, అందుకు కస్టమ్ ఛార్జీలతోపాటు వివిధ పన్నుల రూపంలో డబ్బులు డిపాజిట్ చేయించుకుంటున్నాడు. నిందితుడి మాటలను నమ్మిన బాధితులు లక్షల్లో డబ్బులు డిపాజిట్ చేశారు. బాధితుల ఫిర్యాదుతో రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులు ఢిల్లీకి వెళ్లి నిందితుడిని అరెస్టు చేశారు.v