Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.3.35కోట్లు వసూలు చేసిన నిందితుడి అరెస్టు
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఫార్మాస్యూటికల్స్ అండ్ న్యూట్రాసూటికల్ వ్యాపారంలో లాభాలొస్తాయని డిపాజిట్లు వసూలు చేసి మోసం చేసిన నిందితుడిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం జాయింట్ సీపీ అవినాష ్మహంతీ తెలిపిన వివరాల మేరకు నగరానికి చెందిన టి.సతీష్, అతని భార్య గాయిత్రి కలిసి 'హైదరాబాద్ మిలియనీర్ అలయన్స్' (హెచ్ఎంఏ) నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ సంస్థను బహద్దూర్‌పురాలో ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఫార్మాస్యూటికల్స్ అండ్ న్యూట్రాసూటికల్ ఉత్పత్తులను డిస్ట్రీబూషన్ చేస్తామని నమ్మించారు. 'యూనిటీస్ లైఫ్ సైన్సెస్' పేరుతో కాచిగూడలోని వీఎన్ఆర్ కాంప్లెక్స్‌లో వ్యాపారాన్ని ప్రారంభించారు. తక్కువ పెట్టుబడులతో లక్షలు సంపాదించవచ్చని పలువురిని నమ్మించారు. దాదాపు రూ.3.35కోట్లను వసూలు చేశారు. వీరి చేతిలో మోసపోయిన ఐదుగురు బాధితులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఏసీపీ జి.బిక్ష్యం రెడ్డి ఆదేశాలతో అన్నికోణాల్లో విచారించిన ఇన్స్పెక్టర్ డి.భాస్కర్‌రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 19న సతీష్ భార్య గాయిత్రీని అరెస్టు చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న సతీష్ గాలిస్తున్న పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.