Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
చేనేత వస్త్రాలు తెలుగు సంస్కృతి, సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తాయని ఉమెన్స్ సేఫ్టీ వింగ్ డీఐజీ బి. సుమతి అన్నారు. సోమవారం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్లోని ద్వారకా స్క్వేర్లో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నిహారికా ఏర్పాటు చేసిన శ్రీవైదికి సిల్క్ హ్యాండ్లూమ్ స్టూడియోను ప్రారంభించారు. ఈసందర్భంగా సుమతి మాట్లాడుతూ చేనేత వస్త్రాలను అందరూ ప్రోత్సహిస్తే పరోక్షంగా నేత కార్మికుల అభ్యున్నతికి తోడ్పడినవారవుతామన్నారు. చేనేతపై అందరిలో మక్కవ మరింత పెరుగుతూనే ఉందని, నేత చీర అమ్మ ప్రేమ ఒకేలా ఉంటుందన్నారు. ఫ్యాషన్ డిజైనర్ నిహారిక మాట్లాడుతూ కోవిడ్ ప్రభావంతో పని లేకుండా ఉన్న నేత కార్మికులకు చేయూత ఇవ్వాలనే ఉద్దేశంతో తెలుగు రాష్ట్రాల నేతకారుల ప్రముఖ చేనేతలన్నిటిని ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకే శ్రీవైదికి సిల్క్స్ను ఆరంభించామని తెలిపారు. సంప్రదాయం, ఆధునికత మేళవింపుతో వస్త్రాలను డిజైన్ చేయడమే తమ ప్రత్యేకత అని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ దేవిశ్రీ గురుజీ, నటుడు, మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె, జోష్ రవి, సినీ క్రిటిక్ కత్తి మహేష్ తదితరులు పాల్గొన్నారు.