Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అపోలో హాస్పిటల్స్ అరుదైన ఘనత
నవతెలంగాణ-సిటీబ్యూరో
నగరంలోని అపోలో హాస్పిటల్స్ భారతదేశంలో మొదటిసారిగా సజీవంగా ఉన్న ఇద్దరు దాతల నుంచి అవయవాలను సేకరించి అత్యంత క్లిష్టతరమైనదిగా చెప్పబడే ఒకేసారి కాలేయం, మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స- కాంప్లెక్స్ కంబైన్డ్ లివర్, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఈ క్లిష్టతరమైన శస్త్రచికిత్సను అపోలో హాస్పిటల్స్ చీఫ్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ మనీష్ వర్మ, నిపుణులైన ట్రాన్స్‌ప్లాంట్ వైద్య బందం డాక్టర్ రవి ఆండ్రూస్, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, డాక్టర్ నవీన్ పోలవరపు, కన్సల్టెంట్ చీఫ్ ట్రాన్స్‌ప్లాంట్ హెమటాలజిస్ట్లు, యాభై ఏడు సంవత్సరాల వయస్సు కలిగిన టాంజానియా దేశానికి చెందిన రోగి గాబ్రియేల్ సీజర్ సిసాకు నిర్వహించారు. ఒకే రక్తం గ్రూప్‌కు చెందనటువంటి కాలేయాన్ని సేకరించి శస్త్రచికిత్స ద్వారా రోగి శరీరంలోకి విజయవంతంగా మార్పిడి చేయడంతో ఈ కేసు యొక్క ప్రత్యేకత మరింత పెరిగింది. అవయవ మార్పిడి పనిని ఇది మరింత ప్రమాదకరమైనదిగా చేసింది, అయితే అపోలో హాస్పిటల్స్‌కు చెందిన ట్రాన్స్‌ప్లాంట్ మరియు సహాయక బందాలు తమ విస్త్రృత అనుభవం, అపారమైన నైపుణ్యాలతో ఫలితాన్ని విజయవంతం చేశాయి. శస్త్రచికిత్స అనంతరం రోగి కోలుకున్నాడు. డిశ్చార్జ్ కావడానికి సిద్ధంగా ఉన్నాడు.