Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ నెలాఖరులో నిర్వహించే అవకాశం
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి అడ్డుంకులు ఏర్పడ్డాయి. ఈ తరుణంలో వర్యూవల్గా మొదటి కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించాలని, అందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. డిసెంబర్లో ఎన్నికలు పూర్తై ఫిబ్రవరి 11వ తేదిన జీహెచ్ఎంసీ పాలకవర్గం ఏర్పాటు, కార్పొరేటర్ల ప్రమాణస్వీకారం, మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరిగింది. అంతలోనే హైదరాబాద్-రంగారెడ్డి-మహాబుబ్‌నగర్ పట్టభద్రల నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల కోడ్ వచ్చింది. దీంతో కోడ్ కారణంగా కౌన్సిల్ సమావేశం జరగలేదు. కోడ్ ముగియగానే కోవిడ్-19 మరోసారి విజృంభిస్తోంది. ఈ పరిస్థితుల్లో సమావేశం ఏర్పాటు చేయడానికి అవకాశంలేకుండ పోయింది. అయితే ఇప్పటికే కార్పొరేటర్ల నుంచి ఆయా అంశాలపై 300లకుపైగా ప్రశ్నలు పంపించినట్టు తెలిసింది. వీటన్నింటిని పరిశీలించి 20-30ప్రశ్నలకు కుదించనున్నారు. ఆ తర్వాతనే వర్చువల్ సమావేశం నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఈ వర్చువల్ సమావేశానికి జీహెచ్ఎంసీ నుంచి కార్పొరేటర్లకు ఐప్యాడ్లు కూడ ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఐప్యాడ్లు ఇచ్చిన విషయం తెలిసిందే. కొత్త పాలకవర్గం ఏర్పడి రెండు నెలలు కావొస్తున్న సమావేశం కాలేదని, ఈనెలలోగాని, వచ్చే నెలలోగాని వర్చువల్ సమావేశం నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని నగర మేయర్ విజయలక్ష్మి తెలిపారు.
అందరికి ప్రాధాన్యం : మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
జీహెచ్ఎంసీ పరిధిలోని 150 మంది కార్పొరేటర్లలో పార్టీలకతీతంగా అందరికి ప్రాధాన్యత ఇస్తామని, టీఆర్ఎస్ కంటే బీజేపీ కార్పొరేటర్లు రెగ్యులర్‌గా మాట్లాడుతున్నారని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. తమ ఏరియాలో పర్యటించాలని బీజేపీ కార్పొరేటర్లు అడుగుతున్నారని, మంగళవారం మల్కాజ్‌గిరిలో పర్యటించనున్నట్టు వెల్లడించారు. ముఖ్యంగా మహిళా కార్పొరేటర్లకు అధిక ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. పార్టీలతో సంబంధంలేదకుండ గ్రేటర్‌లోని అన్ని డివిజన్ల అభివద్ధికి తాను కషి చేస్తానని మేయర్ పేర్కొన్నారు. ఈ నెలాఖరున లేదా వచ్చే నెలలో కౌన్సిల్ సమావేశం ఉంటుందని విజయలక్ష్మి తెలిపారు. జోన్లవారీగా కార్పొరేటర్ల సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రతిఒక్కరూ కరోనా టీకా వేసుకోవాల్సిందేనని మేయర్ విజయలక్ష్మి పేర్కొన్నారు.