Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
పోచారం మున్సిపాలిటీ పరిధిలోని కేఎల్ మహేంద్ర నగర్ కాలనీలో ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని స్థానికుల ఫిర్యాదు మేరకు ఏడీ సర్వేయర్ రాంచందర్, తహసీల్దార్ విజయలక్ష్మీ ఆధ్వర్యంలో సోమవారం సర్వే నిర్వహించారు. అన్నోజిగూడ రెవెన్యూ పరిధిలోని సర్వేనంబర్ 14లో వికలాంగుల కాలనీకి 5 ఎకరాల 21 గుంటలు నాటి ప్రభుత్వం కేటాయించగా మూడు ఎకరాలకు పైచిలుకు భూమిలో కేఎల్ మహేంద్ర నగర్ కాలనీ నిర్మించగా మిగులు రెండు ఎకరాల భూమి కబ్జాకు గురైందని స్థానిక నాయకులు అధికారులకు ఫిర్యాదులు చేశారు. దీనిపై గతంలో పలుసార్లు సర్వేలు నిర్వహించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. దీనితో మరో మారు సర్వేకు వినతి పెట్టుకోవడంతో స్పందించిన అధికారులు త్వరలో డిజిటల్ సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ సర్వేయర్ బుచ్చయ్య, మండల సర్వేయర్ జగదీష్, వైస్ చైర్మెన్ నానావత్ రెడ్యా నాయక్, స్థానికి కౌన్సిలర్లు బాలగోని వెంకటేష్, సింగిరెడ్డి సాయిరెడ్డి, నాయకులు బోయపల్లి సత్తిరెడ్డి, బోయపల్లి రాజేశ్వర్ రెడ్డి, తౌర్యా నాయక్, ధన్ సింగ్ నాయక్, పోలీసు సిబ్బంది, కాలనీ వాసులు పాల్గొన్నారు.