Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో సభలు, సమావేశాలు నిర్వహించరాదని, మాస్క్‌లు తప్పని సరిగా ధరించాలని రాష్ట్రభ్రుత్వం 69 జీవోను జారీ చేసిందని, ప్రభుత్వం జారీచేసిన జీవోను సాక్షాత్తు ముఖ్యమంత్రి ఉల్లంఘిస్తే ఎలా అంటూ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ అన్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్ 14న నల్గొండ జిల్లా హాలియాలో సీయం కేసీఆర్ తలపెట్టిన భారీ బహిరంగ సభను ప్రజారోగ్యం దృష్ట్యా రద్దుచేయాలని ఆయన తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా రాచాల మీడియాతో మాట్లాడుతూ కరోనా తీవ్రత దృష్ట్యా ఏప్రిల్ 30 వరకూ ఎటువంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకూడదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో యం.యస్ నెం.69ని జారీ చేసిందని, కానీ సాక్ష్యాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆరే ఆ జీవోను ఉల్లంఘిస్తూ సభ నిర్వహించడం సరికాదని అన్నారు. బహిరంగ సభనిర్వహించడం వల్లా ప్రజారోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతుందన్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నల్గొండ జిల్లా హాలియాలో సీయం కేసీఆర్ తలపెట్టిన బహిరంగ సభను రద్దుచేసేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌తోపాటు రాష్ట్ర డీజీపీకి అదేశాలివ్వాలని కోరారు. కమిషన్‌ను కలిసిన వారిలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు బడేసాబ్, శశికుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.