Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ పరిసరాల్లో వేలకోట్ల రూపాయల సెస్ ఎగవేసిన బడా కంపెనీల నుంచి దానిని వసూలు చేయాలని సీఐటీయూ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్‌సిటీ కార్యదర్శి ఎం.వెంకటేష్ డిమాండ్ చేశారు. నగరంలోని కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ నిర్మాణ వ్యయంలో 1శాతం నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం లేబర్ సెస్ చెల్లించాల్సి ఉండగా బడా కంపెనీలు చెల్లించలేదన్నారు. వసూలు చేయాల్సిన కార్మిక శాఖ నోటీసులు జారీచేసి వదిలేసిందన్నారు. సెస్ ఎగవేతకు సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు జారీచేసిన నోటీసులను కార్మిక శాఖ చెత్తబుట్టలో పడేసిందన్నారు. కార్మికశాఖ ఉన్నతాధికారులు, బడా నిర్మాణ కంపెనీలతో కుమ్మక్కయ్యారని, ఫలితంగానే సెస్ ఎగవేతలో భారీ అవినీతి జరిగిందని విమర్శించారు. అనంతరం 'బీఓసీడబ్ల్యూ బోర్డు నమోదుకు రేషన్‌కార్డును తప్పనిసరిని తొలగించాలి. రూ.110కు బదులు రూ.10 తీసుకోవాలి. బోర్డులో కార్డు నమోదు నుంచి సంక్షేమ పథకాలను వర్తింపజేయాలి.60 ఏండ్లు దాటిన వారికిసైతం అర్హత ఉండాలి. కార్డు రెన్యూవల్ సీనియారిటిని తొలగించాలి. సెస్ వసూలు కుంభకోణంపై విచారణ జరిపించాలి. వివాహ, కాన్పు సహాయాలకు లక్ష రూపాయలకు పెంచాలి. బోర్డు నుంచి మళ్లించిన రూ.1000కోట్ల తిరిగి తెప్పించాలి' అనే డిమాండ్లతో కూడిన మెమోరాండంను లేబర్ కమిషనర్‌కు అందజేశారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ నగరసహాయ కార్యదర్శి డీఎల్.మోహన్, కార్మికులు పాల్గొన్నారు.