Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
తెలుగు ప్రజలందరూ ఉగాదిని సంతోషంగా, ఉత్సాహంగా జరుపుకోవాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి అన్నారు. శ్రీప్లవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. చైత్రశుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఉగాది పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, కొత్త సంవత్సరంలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలతో ముందుకు సాగాలని అందరూ సుఖ సంతోషాలతో విలసిల్లాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత నూతన లక్ష్యాలను పెట్టుకొని, ఆ లక్ష్యాలను అందుకునేందుకు ప్రణాళికబద్ధంగా కష్టపడాలన్నారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇండ్లలోనే పండుగను కుటుంబసభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని ఆమె సూచించారు.