Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా మహమ్మారి పట్ల సీనియర్ సిటిజన్స్ జాగ్రత్తగా ఉండాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. మంగళవారం సుభాష్‌నగర్ డివిజన్ పరిధిలోని ఎస్‌ఆర్‌నాయక్ నగర్లో సీనియర్ సిటిజన్స్ కోసం ఏర్పాటు చేసిన షెడ్‌ను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ షెడ్ ఏర్పాటుకు కాలనీవాసులు ముందుకు రావడం సంతోషకరమన్నారు. తప్పని పరిస్థితిలో బయటకు వస్తే జాగ్రత్తలు పాటించాలన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రంగారావు, నాయకులు శేషాచారి, భాస్కర్‌రెడ్డి, హరిబాబు, రాజారెడ్డి, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సుబ్రమణ్యం, ప్రధాన కార్యదర్శి సదానందచారి, కోశాధికారి వెంకటేశ్వరరావు, హమీద్ తదితరులు పాల్గొన్నారు.