Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ప్రతి బస్తీ, కాలనీల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు ముందుకు రావాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. మంగళవారం జీడిమెట్ల డివిజన్ పరిధిలోని భూమిరెడ్డికాలనీలో హైదరాబాద్ వీల్స్, మాతృ భూమి డెవలపర్స్ సహకారంతో రూ.2.60 లక్షలతో ఏర్పాటు చేసిన 21 సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీసీ కెమెరాలు నేరాల నియంత్రణకు ఎంతగానో దోహదపడుతా యన్నారు. ఇంతటి చక్కటి కార్యక్రమానికి దాతలు ముందుకు రావడం అభినందనీ యమన్నారు. అనంతరం ఉగాది పర్వదినం సందర్భంగా జీడిమెట్ల డివిజన్ పరిధిలోని కుత్బుల్లాపూర్‌లోని శ్రీవేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హోమశాలను ప్రారంభించగా, రథశాల నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో ఎస్ఐలు మన్మథ్రావు, గౌతమ్, చంద్రశేఖర్, సత్యం, కాలనీ అధ్యక్షులు భూపాల్‌రెడ్డి, చీఫ్ అడ్వైజర్ బల్వంత్‌రెడ్డి, అడ్వైజర్ పెద్ది మల్లేషం, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, మహిళా వైస్ ప్రెసిడెంట్ సంతోషి, ప్రధాన కార్యదర్శి రవికుమార్, జాయింట్ సెక్రటరీ రవీందర్‌గౌడ్, కోశాధికారి సత్తిరెడ్డి పాల్గొన్నారు.