Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
చలివేంద్రాలు ప్రజల దాహార్త్తిని తీర్చేందుకు ఎంతగానో దోహదపడతాయని శేరిలిం గంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని ఉషాముళ్ళపూడి కమాన్ వద్ద క్షత్రియ యూత్ అసొసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయనతో పాటు స్థానిక కార్పొరేటర్లు నార్నే శ్రీనివాస్‌రావు, ఉప్పలపాటి శ్రీకాంత్‌లతో కలిసి ప్రారంభించారు. అనంతరం చల్లని మజ్జిగ కాలనీ వాసులకు అందజేశారు. వేసవి కాలంలో ప్రజల దాహాన్ని తీర్చడం గొప్ప విషయమన్నారు. ప్రజలకు ఉపయోగపడేలా ఇలాంటి చలివేంద్రాలు ఏర్పాటు చేయడంపై క్షత్రియ యూత్ అసోసియేషన్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ బిల్డర్ వర్టెక్స్ వర్మ, శ్యామల్రాజు, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్‌యాదవ్, నాయకులు కాశీనాథ్ యాదవ్, పోతుల రాజేందర్, అనిరుధ్యాదవ్, క్షత్రియ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.