Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్కై ఫౌండేషన్ ప్రెసిడెంట్ సంజీవ్ కుమార్
నవ తెలంగాణ - అడిక్మెట్
అనాథలు, అభాగ్యులతో ఉగాది జరుపుకోవడం సంతోషం గా ఉందని స్కై ఫౌండేషన్ ప్రెసిడెంట్ సంజీవ్ కుమార్ తెలిపారు. స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉగాది సందర్భం గా అనాధలకు, అభాగ్యులకు ఉగాది పచ్చడి పంపిణీి చేసి వారితో పండగ జరుపుకున్నారు. అనంతరం సంజీవ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పండుగను తమ కుటుంబాలతో సంతోషంగా జరుపుకుంటారు. కానీ రోడ్డుపై నివసిస్తున్న అనాధలకు అభాగ్యులకు ఎటువంటి కుటుంబాలు ఉండవు. వాళ్లను పలకరించే వాళ్ళు ఎవరు ఉండరు. వారితో పండగ జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఉగాది పచ్చడి, బక్షాలు, పండ్లు, బటర్ మిల్క్, బిస్కెట్ ప్యాకెట్స్, వాటర్ ప్యాకెట్స్ అందించామని తెలిపారు. ఈ కార్యక్రమములో ప్రెసిడెంట్ డాక్టర్. వై. సంజీవ కుమార్, వైస్ ప్రెసిడెంట్ ఓ.పావని, సభ్యులు, సరస్వతి, స్వప్నిల్, శ్రీనాథ్, హర్ష మొదలగు వాళ్ళు పాల్గొన్నారు.