Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అడిక్మెట్
ముషీరాబాద్ నియోజకవర్గంలోని బోలక్పూర్ డివిజన్లో నూతనంగా ఏర్పాటు చేసిన అల్ కరీం రెడీమేడ్ షాప్ను మంగళవారం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజ లకు నాణ్యమైన దుస్తులు అందిస్తూ ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమానికి స్థానిక డివిజన్ ప్రెసిడెంట్ మహమ్మద్ అలీ, కార్యదర్శి వై శ్రీనివాస్, జూనైద్ బాగ్దాది, అబ్రార్ హుస్సేన్, రహీం, మున్వర్ చాద్, మక్బూల్, ఇమ్రాన్ బాగ్దాది, సునీల్, షాప్ ఓనర్లు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.