Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పంజాగుట్ట సర్కిల్లో ఏర్పాటు చేస్తే తప్పేంటి అని మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ప్రశ్నించారు. అంబర్‌పేటలో తన నివాసంలో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించి రెండు రోజులకు చేరినా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేకుండాపోవడంతో ఆయన మండిపడ్డారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉగ్రవాదా? ఇంకా ఎన్నిరోజులు ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పోలీసుల నిర్బంధంలో పెడతారు అన్నారు. ఈనెల 14 తారీకున జరిగే అంబేద్కర్ జయంతి సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పంజాగుట్ట చౌరస్తాలో ఏర్పాటు చేయాలని, లేని పక్షాన ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీి సెక్రెటరీ శంబూల శ్రీకాంత్‌గౌడ్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు జమీర్, ఫరీద్ వి.హనుమంతరావు దీక్షకు మద్దతుగా పలు సంఘాలు మద్దతు పలుకుతున్నాయి. మద్దతు పలికిన వారిలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. బడే సాబ్, తెలంగాణ బీసీ జాగతి ఆధ్వర్యంలో మాజీ పీసీసీ అధ్యక్షులు వి.హనుమంత రావు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం పున:ప్రతిష్ట చేయాలని ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. దానికి తెలంగాణ బీసీ జాగతి అధ్యక్షులు మురళి కష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్, లింగంగౌడ్, ప్రధాన కార్యదర్శి సుదర్శన్, పోలోజు వేణుగోపాల చారి నరేందర్, ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు తెలిపారు.