Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- జూబ్లీహిల్స్
జూబ్లీహిల్స్ నియోజకవర్గం కంటెస్ట్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, తన తండ్రి సీని యర్ రాజకీయ నాయకుడు చిన్న శ్రీశైలం యాదవ్‌తో కలిసి, రహ్మత్ నగర్‌లోని కష్ణవేణి టాలెంట్ స్కూల్ బిల్డింగ్ ఆవరణలో, ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్‌ను తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసి ఉగాది సందర్భంగా ప్రారంభించారు. ఎండాకాలం మరియు రంజాన్ మాసం సందర్భంగా, ప్రధాన రహదారిపై వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినందుకు స్థానికులు యువ నాయకుడు నవీన్ యాదవ్‌ను అభినందించారు. నెల క్రితం యూసుఫ్‌గూడ చెక్ పోస్ట్‌లోని ప్రభుత్వ పాఠశాల వద్ద తన సొంత ఖర్చులతో ఉచిత చలివేంద్రం వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు వెంకట యాదవ్, రమేష్ యాదవ్, అక్రమ్,సత్యం, హరమందేర్ సింగ్, రవి కుమార్, అనిల్, మరియు అనేక మంది యువకులు పాల్గొన్నారు.