Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
వసంతం అంటేనే ప్రకతి పరవశం. జ్ఞానం నిరంతర ప్రవాహ వసంతం. ఆ వసంతాన్ని కలంలో కురిపించేవారు కవులు, రంగుల చిత్రాల్లో కనులకువిందు చేసేవారు చిత్రకారులని తెలంగాణ భాషా సాంస్కతిక శాఖ సంచాలకులు మామిడి హరికష్ణ అభివర్ణించారు. ఉగాది వర్ణిక పేరిట ఏర్పరచిన తైలవర్ణ చిత్రాలు వసంత పర్ణిక అన్నారు. రవీంద్రభారతి ప్రాంగణంలో సోమవారం భాషా సంస్మతిక శాఖ సౌజన్యంతో కాళీ పట్నం ఆర్ట్స్ అకాడెమీ నిర్వహణలో కె.గాయత్రి, ప్రసన్న, తదితరుల తైల వర్ణచిత్ర ప్రదర్శనను హరికష్ణ ప్రారంభించి మాట్లాడారు. మానసిక ఆందోళనలు రుగ్మతలు నివారణకు రంగులు ఒక చికిత్స అన్నారు. గాయత్రి చిత్రాలు ఐదు సంవత్సరాలలో పరిణతి దిశగా మార్పును గమనించవచ్చన్నారు. యువత తమ కళను నవీకరించుకొంటూ మరిన్ని ప్రయోగాలు చేయాలని సూచించారు. హైదరాబాద్ ఆర్ట్స్ సొసైటీ అధ్యక్షులు ఎం.వీ. రమణ రెడ్డి మాట్లాడుతూ.. కరోనా కాలంలో కళాకారులు అనేక ఇబ్బందులు పడ్డారని, వారికి ప్రభుత్వ సహాయం అవసరమని అన్నారు. గాయత్రి కుంచెతో రంగుల మేజిక్ చేసిందసన్నారు. సినీ రచయిత మారుడూరి రాజా మాట్లాడుతూ.. గాయత్రి చిత్ర కారిణి మాత్రమే కాదని, రచయిత్రి, గాయని తదితర పలు కళల్లో ప్రవేశం ఉందని అన్నారు. సంఖ్యాశాస్త్ర వేత దైవజ్ఞ శర్మ పాల్గొని సభకు వందన సమర్పణ చేస్తూ గాయత్రి 17వ తేదీ వరకు ప్రదర్శన ఉంటుందని తెలిపారు.