Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
రాష్ట్రవ్యాప్తంగా జరిగే భారత రాజ్యాంగ నిర్మాత, అణగారిన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ 131వ జయంతి ఉత్సవా లను ఘనంగా నిర్వహించాలని అంబేద్కర్ సం ఘాల రాష్ట్ర కన్వీనర్ రాపోలు రాములు పిలుపు నిచ్చారు. ఈమేరకు మంగళవారం తన నివాస ంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశం లోని అణగారిన, వెనకబ డిన వర్గాలకు హక్కులను సాధించి పెట్టడంలో అంబే ద్కర్ జీవితాన్నే దారబో శారని అన్నారు. ఆ మహనీయుడి త్యాగం ద్వారా వచ్చిన హక్కులను నేడు అనుభవిస్తూ కొంతైనా ప్రగతి సాధించామని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపు నిచ్చారు.