Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరు నెలల్లో పది మంది బాధితులు
- పిల్లలు, పెద్దలు ఎవ్వరినీ వదలని కుక్కలు
నవతెలంగాణ-ఏఎస్‌రావునగర్
చర్లపల్లి భరత్‌నగర్‌లో నివాసం ఉంటున్న నహీం (6) ఇంటి ఎదురుగా ఉన్న దుకాణం నుంచి బిస్కెట్లు కొనుక్కుని తిరిగి వస్తుండగా వీధి కుక్కలు వెంటపడి కరిచాయి. దీంతో ఆ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో చిన్నారిని మల్లాపూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కంద్రానికి తల్లిదండ్రులు తీసుకెళ్లారు. అక్కడ వ్యాక్సిన్ లేకపోవడంతో నారాయణగూడలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గతంలో కూడా వీధికుక్కలు దాడిచేసి పిల్లల్ని, పెద్దల్ని గాయపరిచిన సంఘటనలు ఇక్కడ జరి గాయి. అయినా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకుని వీధికుక్కల బెడద లేకుండా చేయడంలో నిర్లక్ష్యం చేస్తు న్నారనడానికి తాజా ఘటనే ఉదాహరణగా పేర్కొన వచ్చు. ఇప్పటికైనా అధికారులు వీధికుక్కల బెడద లేకుం డా చర్యలు తీసుకోవాలని డివిజన్ ప్రజలు, చర్లపల్లి కాలనీల సమాఖ్య నాయకులు కోరుతున్నారు.