Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
ఉపాధి కోల్పోయి ఆర్ధిక ఇబ్బందులతో అనేక ఇబ్బందులు పడుతున్న విద్యావాలం టీర్లకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి ఆదుకోవాలని టీజేఎస్ విద్యార్ధి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నిజ్జన రమేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకనట విడుదల చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో ఆత్మహత్య చేసుకున్న విద్యావాలంటీర్ పాల కూరి శైలజ ఘటనే అందుకు సాక్ష్యమని తెలి పారు. రాష్ట్రంలో ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. 15 నెలలుగా విద్యావాలంటీర్లకు జీతాల్లేక ఆర్ధిక ఇబ్బందులు తట్టుకోలేక నిన్న రాత్రి నల్గొండ రైల్వేస్టేషన్ పరిధిలో రైలు కిందపడి చనిపోవడం చాలా బాధాకరమని తెలిపారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగైన శైలజ భర్త ఉద్యోగం రెన్యూవల్ కాక, జీతం లేక, పూటగడవక నాలుగేండ్ల పాపకి తిండి పెట్టలేని పరిస్థితిని చూసి భర్త పడుతున్న ఆవేదనను చూసి శైలజ ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు. కరోనా మూలంగా జీతాల్లేకుండా విద్యావాలంటీర్లు జీవితాలను నెట్టకొస్తున్నారనీ, రాష్ట్ర ప్రభు త్వం వెంటనే వారిని ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. తక్షణమే విద్యావాలం టీర్లను రెన్యవల్ చేసి విధుల్లోకి తీసుకుని జీతాలివ్వాలనీ, వివిధ రంగాల్లో ఉపాధి కో ల్పోయిన వారికి ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ప్యా కేజీ ప్రకటించి ఆదుకోవాలనీ, కరోనా కాలం లో ఉపాధి కోల్పోయిన వారికి నెలకు రూ.7, 500 జీవన భృతి ఇచ్చి ఆదుకోవాలని కోరారు.