Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏఎస్రావు నగర్
తడి పొడి చెత్తను వేరుచేసి రిక్షాలలో వేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. మంగళ వారం కాప్రా సర్కిల్ కార్యాలయంలో చెత్త రిక్షాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లా డుతూ.. తడి పొడి చెత్తను రోడ్లపై వేయకుండా కాలనీ లో ఇంటి వద్దకు వచ్చే చెత్త రిక్షాలోనే వేయాలని సూచి ంచారు. ఎక్కడపడితే అక్కడ చెత్తనే వేస్తేకఠిన చర్యలు తీసుకోవడమేగాక జరిమానాలు విధిస్తారని హెచ్చరిం చారు. సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్‌ల ఆదేశాల మేరకు నగరాన్ని స్వచ్ఛ నగరంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కూడా కషి చేయాలని కోరారు. కాప్రా సర్కిల్ పరిధిలోని ఆరు డివిజన్లలో ఇంటింటా, చెత్తను సేకరించేందుకు ఆటో రిక్షాలను పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్య క్రమంలో డిప్యూటీ కమిషనర్ శంకర్, మెడికల్ ఆఫీసర్ మైత్రేయి, కార్పొరేటర్లు స్వర్ణరాజ్, శిరీష సోమశేఖర్ రెడ్డి, బొంతు శ్రీదేవి, జెర్రిపోతుల ప్రభుదాస్, దేవేందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మైపాల్ రెడ్డి మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి, వివిధ కాలనీల అధ్యక్ష కార్యదర్శులు, టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.