Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏఎస్‌రావునగర్
కాప్రా సర్కిల్ పరిధిలోని కాప్రా, ఏఎస్ రావు నగర్, చర్లపల్లి, హెచ్‌బీ కాలనీ, డివిజన్లలో రోడ్లపై ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లకు ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. వీటికి ఫెన్సింగ్ లేకపో వడం వల్ల ప్రమాదకరంగా మారాయి. ఎప్పడు, ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు భయపడుతు న్నారు. శనివారం మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలో ని మౌలాలి డివిజన్లోని ఈస్ట్ ప్రశాంత్ నగర్లో స్టూడెంట్ అభిషేక్ ఆడుకుంటూ ట్రాన్స్ఫార్మర్కు తగిలి గాయపడిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఘట నలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఇప్ప టికైనా అధికారులు, ప్రభుత్వం స్పందించి రక్షణలేని ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ కంచెలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
విద్యుత్‌శాఖ అధికారులు స్పందించాలి
ఫెన్సింగ్లేని ట్రాన్స్ఫార్మర్లతో ఎప్పటికైనా ప్రమాదం పొంచి ఉటుంది. విద్యుత్‌శాఖ అధికా రులు స్పందించి వెంటనే ఫెన్సింగ్ ఏర్పాటు చేయా లి. మౌలాలి, గాంధీనగర్‌లో చిన్నారి ప్రమాదానికి గురైన సంఘటన దష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా వెంటనే చర్యలు తీసుకోవాలి.
- ఎం. పాల పద్మారెడ్డి, చర్లపల్లి కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధి