Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట :
కుత్బుల్లాపూర్ సర్కిల్ రంగారెడ్డినగర్ డివిజన్ రంగారెడ్డినగర్‌కు చెందిన మానస టూల్ టెక్ అధినేత, ఆత్మీయ భారతీ సాహిత్య సేవా సంస్థ అధ్యక్షులు వాకిటి రామ్‌రెడ్డి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా బుధవారం నల్గ్గొండలో పుడమి జాతీయ వేదిక ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు శాసన మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆయన చేతుల మీదుగా పురస్కారాన్ని రామ్‌రెడ్డికి అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాహిత్య, సామాజిక రంగాలలో వాకిటి రామ్‌రెడ్డి కృషి గొప్పదన్నారు. జన చైతన్యం, కరోనాపై అవగాహన కార్యక్రమాలు, ప్రతిభ విద్యార్థులకు ప్రోత్సాహం వంటి తెలుగు సాహిత్యంలో 200లకు పైగా పాటలు రాసి తన ప్రతిభతో యువతకు ఆదర్శంగా నిలిచారన్నారు. వాకిటి రామ్‌రెడ్డి మాట్లాడు తూ తనకు ఇంతటి పురస్కారం లభించినందుకు అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా బాల్రెడ్డికి వాకిటి రామ్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మునుసు వెంకట్, పంచశీల ఫౌండేషన్ జింకల వెంకటేశం, అభ్యుదయ కవి గోపి, కవి హసెన, ఇంద్రసేనారెడ్డి, రాజిరెడ్డి, తెలుగు కవులు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు.