Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ:
ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి కుమారుడు , టీం బిఎస్ఆర్ వ్యవస్థాపకులు టీఆర్ఎస్ యువ నాయకులు భేతి సుమంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన మిత్రులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. రక్తదాన శిబిరం, అనాథాశ్రమంలో పండ్ల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ ముఖ్య నాయకులు కొంగల శ్రీధర్, యం.హరీష్, రెహమాన్, డి.శ్రీధర్, రమేష్, నవీన్, అరవింద్, జీవన్, నగేష్, భాగ్యమ్మ, రత్నమాల, శోభారాణి, దుర్గ, కోటీశ్వరి, వరలక్ష్మి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన కార్యకర్తలకు టీఆర్ఎస్ నాయకులకు సుమంత్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.