Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, పీడీఎస్యూ వ్యవస్థాపకుడు జార్జిరెడ్డి స్ఫూర్తితో ఉద్యమిద్దామని పీడీఎస్యూ అధ్యక్షులు డి.రంజిత్ అన్నారు. అంబేద్కర్ జయంతి, జార్జిరెడ్డి వర్ధంతి ఒకే రోజు కావడం యాదృచ్ఛికమే అయినా వారు విభిన్న వాదులు కాదనీ, వారి అంతిమ లక్ష్యం సమసమాజమనీ, ిరంజిత్ అన్నారు. బుధవారం ఆ సంఘం ఓయూ కమిటీ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీ వద్ద అంబేద్కర్ జయంతి, జార్జిరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని సంస్కరణ కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ప్రొఫెసర్లు డాక్టర్ ఇ.పేందర్, డాక్టర్ రమణ మాట్లా డారు. భారత కుల వ్యవస్థ రద్దు కోసం అంబేద్కర్ చేసిన కృషి ఎనలేనిదన్నారు. మతోన్మాద ఆధిపత్యంపై, వారి లంపెస్ విధానాలపై పోరాడుతూ 1972 ఏప్రిల్ 14న హత్యకు గురైన జార్జిరెడ్డి నిత్య స్ఫూర్తి ప్రధాత అన్నారు. అంబేద్కర్ కులోన్మాదంపై, జార్జిరెడ్డి మతోన్మా దంపై వారివారి మార్గాల్లో పోరాడిన మహీనీయుల న్నారు. ఒకే లక్ష్యంతో పని చేసిన విభిన్న బాటసారులైన ఇద్దరి స్ఫూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మార్పు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. నేటి పాలకులు కులోన్మాదాన్ని, మతోన్మాదాన్ని పెంచి పోషిం చుకుంటూ ప్రయివేటీకరణ లక్ష్యంతో, ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న తీరును నిలదీయడమే అంబ ేద్కర్, జార్జిరెడ్డిలకు అర్పించే నిజమైన నివాళి అన్నారు. అంతకు ముందు ఆర్ట్స్ కాలేజీ ఎదుట అంబేద్కర్, జార్జిరెడ్డిల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పి ంచారు. ఈ కార్యక్రమంలో వివిధ విద్యార్థి సంఘాల నేతలు ఆర్ఎన్ శంకర్, పాల్వాయి నగేష్, సనుగుల రంజిత్ తదితరులు ప్రసంగించారు. పీడీఎస్యూ నాయకులు శరత్, మధు, పవన్ పాల్గొన్నారు.