Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించి ప్రపంచ మేధావి భారతరత్న బాబాసాహేబ్ అంబే ద్కర్ అని జిల్లా పరిషత్ చైర్మెన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి అన్నారు. ఘట్కేసర్ మండలం కాచవాని సింగారం గ్రామంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు నాగులప్లి శ్రీనివాస్ దళిత సంఘం నాయకులు కిన్నెర రవి మాదిగల ఆధ్వర్యంలో అంబేద్కర్ 130వ జయ ంతి సందర్భంగా స్థానిక సర్పంచ్ కొంతం వెంకట్ రెడ్డితో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సంద ర్భంగా చైర్మెన్ మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలన్నీ అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకుంటు న్నాయని అన్నారు. భారత రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరునికీ హక్కులు కల్పించిన మహాను బావుడు అంబేద్కర్ అని కొనియాడారు. అనంతరం ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ... యువత అంబేద్కర్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. నిర్మల బిక్షపతి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎంపీపీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మట్ట విష్ణుగౌడ్, వార్డు సభ్యులు కిన్నెర లక్ష్మీ శ్రీ, పెరుమాండ్ల సుదర్శన్, మహేష్ కుమార్, బండిరా శ్యామ్, మాజీ ఎంపీటీసీ నాగులపల్లి రమేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కర్రె రాజేష్, నాయకులు కిన్నెర జంగయ్య, కర్రె అశోక్, బొడిగె కృష్ణ,్గ తదితరులు పాల్గొన్నారు.