Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలను నగర డిప్యూటీ మేయర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బుధవారం లోయర్ ట్యాంక్ బండ్ డంపింగ్ యార్డ్ వద్ద జి.హెచ్.ఎం.సి కార్మికులు, కార్మిక సంఘంనాయకులతో కలిసి నగర డిప్యూటీ మేయర్ శోభన్ రెడ్డి, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు మోతె శోభన్ రెడ్డి కేక్ కట్ చేసి అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా జి.హెచ్.ఎమ్.సి కార్మికులు, కార్మికసంఘం నాయకులు, డంపింగ్ యార్డులో ఎదుర్కుంటున్న పలు సమస్యలను డిప్యూటీ మేయర్ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన డిప్యూటీ మేయర్ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని, టీబీటీ డంపింగ్ యార్డుపై ప్రత్యేక దృష్టి పెడతానని హామీ ఇచ్చారు. టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు మోతె శోభన్ రెడ్డి మాట్లాడుతూ అన్ని సమస్యలను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామన్నారు. అనంతరం ట్యాంకుబండ్ వద్దగల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు.