Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్-3 ప్రకార మే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. ముందుచూపు ఉన్న సీఎం కేసీఆర్ విజన్‌తో తెలంగాణ అభివృద్ధి చెందుతోందని అభిప్రాయపడ్డారు. భారతరత్న అంబేద్కర్ 130 జయంతిని బుధవారం దేవర యాంజల్, తూంముకుంట మున్సిపాల్టీలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి రాజశేఖర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ విజన్ చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని రాజ్యాంగంలో ఆర్టికల్-3 పొందుపర్చినట్టు తెలిపారు. ఈ ఆర్టికల్ ద్వారా ఏర్ప డిన తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ ముందుచూపుతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ముఖ్య ంగా రాష్ట్రంలో గురుకులాల కోసం సుమారుగా రూ. ఆరువేల కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. ఒక్కో విద్యా ర్థి మీద రూ.లక్షా 15 వేలు ఖర్చు చేస్తున్నారని చెప్పారు. ఈ గురుకులాలకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను సెక్రెటరీగా నియమించి వారి ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ బిడ్డలకు అద్భుతమైన విద్యను అందిస్తున్న ప్రభుత్వం దేశం లో ఏదైనా ఉంది అంటే అది మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కటే అనే విషయాన్ని గంటపదంగా చెప్పగలం అన్నారు. అంబేద్కర్ అందించిన రిజర్వేషన్లు ఇంకా అందుకోలేని వర్గాలవారికి మనమే ముందుండి అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయసాధన దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి బి.శంకర్, మున్సిపల్ వైస్ చైర్మెన్ వాని వీరారెడ్డి, కౌన్సిలర్లు నర్సింగ్‌గౌడ్, నర్సింగ్, నర్సింగరావు, ఉమా శ్రీనివాస్, మహేందర్, శ్రీను, రాహుల్, సురేందర్, రాజు, శ్రీకాంత్, కిరణ్, నందు, తదితరులు పాల్గొన్నారు.