Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో
భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మహా మేధావి అని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జి. రఘు మారెడ్డి కొనియాడారు. అంబేద్కర్ జయంతి వేడుకలను బుధవారం మింట్ కాంపౌండ్‌లోని టీఎస్ఎస్పీడీసీఎల్ సంస్థ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంస్థ సీఎండీ రఘుమారెడ్డి ముఖ్య అథితిగా హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లర్పించి మాట్లాడారు. అంబేద్కర్ తన అమోఘ మే ధాశక్తితో రాజ్యాంగాన్ని రచించి భారత పరిపాలనా వ్యవస్థ కు ఒక రూపాన్ని చేకూర్చిన మహనీయుడన్నారు. దేశంలో నే కాదు ప్రపంచంలోనే గొప్ప మేధావి అని వారి సేవల ను కొనియాడారు. తన జీవితాంతం సమసమాజ నిర్మా ణం కోసం అహర్నిశలు తపించిన ఆ మహనీయున్ని ఆద ర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు టి.శ్రీనివాస్, జె.శ్రీనివాసరెడ్డి, ఎస్. స్వామిరెడ్డి, సీజీఎంలు కె. సాయిబాబా, మజీదుల్లాV్‌ా ఖాన్, ఎస్ఈ సివిల్ శ్రీనివాస్‌రావు, ఇతర అధికారులు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి నివాళ్లర్పించారు.