Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
నవతెలంగాణ-ఎల్బీనగర్
లింగోజీగూడ డివిజన్లో బాక్స్ డ్రైన్స్ పనుల కోసం మొత్తం రూ.103 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలిపారు. బుధవారం లింగోజిగూడా డివిజన్ పరిధి మణిపూరి కాలనీలో మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత నవంబర్లో కురిసిన భారీ వర్షాల వల్ల నియోజకవర్గంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయంకావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని సమగ్ర ప్రణాళికలు రూపొందించి నియోజకవర్గ పరిధిలోని ఇబ్బందికర ప్రాంతాల్లో వర్షపు, డ్రెయినేజీ నీరు సాఫీగా పోవడానికి నూతన డ్రైన్స్ నిర్మాణ పనులకు రూ.103 కోట్ల నిధులు మంజూరు కాగా, ప్రస్తుతం రూ.28కోట్లు విడుదల అయినట్లు చెప్పారు. బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులను సాధ్యమైనంత త్వరలో పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో లింగోజిగూడా డివిజన్ అధ్యక్షులు తిలక్ రావు, నర్సింహా గుప్తా, మధుసాగర్, ప్రవీణ్ రెడ్డి పాల్గొన్నారు.