Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తమకు క్వారంటైన్ (వారం రోజులు డ్యూటీ, వారం రోజులు లీవ్) సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కింగ్ కోఠిలోని హైదరాబాద్ జిల్లా ఆసుపత్రి ముందు ఎదుట ఆస్పత్రి నర్సింగ్ ఉద్యోగులు బుధవారం ధర్నా చేశారు. ఉదయం 10 గంటలకు ఉన్నట్టుండి నర్సింగ్ ఉద్యోగులు, ఆస్పత్రి సిబ్బంది ఒక్కసారిగా ఆందోళనకు దిగడంతో రోగులకు కొద్దిసేపు సేవలు నిలిచిపోయాయి. ఈసందర్భంగా నర్సింగ్ ఉద్యోగులు మాట్లాడుతూ.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యం పీపీఈ కిట్లతో ఆరేడు గంటలు డ్యూటీ చేయాల్సి వస్తోందన్నారు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న కేసులు, రోగులకు సేవలు అందించేందుకు ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోగులకు సేవలందిస్తున్న తమకూ షిఫ్టుల ప్రకారం గతేడాది మాదిరి క్వారంటైన్ సెలవులు ఇవ్వాలని కోరారు. నర్సింగ్ ఉద్యోగులు, ఆస్పత్రి ఏజీల్ ఉద్యోగులు పాల్గొన్నారు.