Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ 130వ జయంతిని నగర మేయర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి, విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పుంచారు. బుధవారం ట్యాంక్ బండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజా ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలతో కలిసి నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ... సమ సమాజ స్థాపనకోసం, దేశాభివృద్ధి కోసం నిరంతరం పాటుపడిన మహానీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు నడుచుకోవాలని, ఆయన సూచించిన మార్గంలో పయనించి, నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు.