Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మెహదీపట్నం
హోంగార్డ్స్ పోస్టులు సివిల్ పోస్టులు అంటూ వారిని ఎలా పడితే అలా ఉద్యోగాల నుంచి తీసివేయరాదంటూ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల తెలంగాణ హోంగార్డ్స్ సంఘం సీనియర్ అధ్యక్షులు కోత్వాల్ దయానంద్ హర్షం వ్యక్తం చేశారు. ఈమేరకు గురువారం హైదరాబాదులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ హోంగార్డ్స్ సంస్థ స్వచ్ఛంద సంస్థ కాదంటూ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించారు. ఈతీర్పు దేశంలోని హోంగార్డులందరి జీవితాలలో వెలుగు నింపిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో హోంగార్డులకు మంచి జీతాలు లభిస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. సమావేశంలో తెలంగాణ హోమ్ గార్డ్ సంఘం అధ్యక్షులు రాజేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కుమారస్వామి, కోశాధికారి హరిబాబు తదితరులు పాల్గొన్నారు.