Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్బీనగర్
కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వానికి అండగా నిలవాలన్న ఉద్దేశంతో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం చార్టర్ ప్రెసిడెంట్ లయన్ డా. కాచం సత్యనారాయణ ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డికి గురువారం లక్ష మాస్కులను అందజేశారు. జీవీకే ఆస్పత్రి అధినేత డా. కిరణ్ కుమార్, హెచ్. వెంకన్న, డా. కరుణాకర్ ఉన్నారు. కాచం సత్యనారాయణ మాట్లాడుతూ.. కరోనా విజృంభిస్తోందని, పక్క రాష్ట్రాలలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు మనం ఎదుర్కొకుండా ఉండాలంటే స్వీయ రక్షణే పరిష్కార మార్గమన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్ వినియోగించాలని సూచించారు. జీహెచ్ఎంసీ ఎల్బీ నగర్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సమాజంపట్ల భాద్యతతో, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం చార్టర్ ప్రెసిడెంట్ లయన్ డా. కాచం సత్యనారాయణ మాస్కులు అందివ్వడం అభినందించదగ్గ విషయమని అన్నారు. సామాజిక సేవ ఆయనకు కొత్తేమీ కాదని లాక్డౌన్ సమయంలో వలస కూలీలకు, పేదలకు, వివిధ వర్గాలకు ఆయన అందించిన చేయూత అమోఘమని అన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం ప్రతినిధులు ఏక సాయి, నంగునూరి రమేష్, డాక్టర్ శ్రవణ్, భరత్‌రెడ్డి, శ్రీనివాసరావు, విద్యాసాగర్, పురేందర్నేత, లయన్ కిషన్గుప్త, రవికిరణ్, వనమాల రమేష్, మోతే రఘు తదితరులు పాల్గొన్నారు.