Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాంనగర్
ముషీరాబాద్ నియోజక వర్గంలోని జర్నలిస్టులకు ఇల్లు ఇండ్ల స్థలాల కోసం కృషి చేస్తానని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పేర్కొన్నారు. గురువారం రామ్ నగర్లోని ఎస్ఆర్టి కమ్యూనిటీ హాల్లో ముషీరాబాద్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన డైరీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ టీిఆర్ఎస్ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కషి చేస్తుందని, అందులో భాగంగానే ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ స్థలాలను గుర్తించి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వచ్చే విధంగా ముఖ్యమంత్రి దష్టికి తీసుకెళ్తానని చెప్పారు. జర్నలిస్టులు ఎప్పటికీ ప్రజాపక్షమే వహించాలని సూచించారు. కాంగ్రెస్ యువజన విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం.అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ముషీరాబాద్ నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు అధికారులు ప్రజాప్రతినిధుల దష్టికి తీసుకురావడంలో ముషీరాబాద్ జర్నలిస్టుల కషి అభినందనీయమన్నారు. కరోనా నేపథ్యంలో ముషీరాబాద్ ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక కరోనా హాస్పిటల్ ఏర్పాటు కోసం కషి చేయాలని ఎమ్మెల్యేకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీి కార్యదర్శి నగేష్ ముదిరాజ్ రాంనగర్ డివిజన్ కార్పొరేటర్ రవి చారి టీిఆర్ఎస్ నాయకులు నవీన్, కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షులు వీడీ కష్ణ శ్యామ్ సుందర్ ఖదీర్, ముషీరాబాద్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు బొల్లం శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి ఎర్రం నర్సింగరావు ఉపాధ్యక్షులు కందుకూరి నరసింహ, వేణు, శివ, కార్యదర్శులు కనకరాజు, ఎం.జహంగీర్, వీరన్న, ప్రచార కార్యదర్శి మనోహర్,సంపత్, నర్సింగరావు, శ్రీధర్, రహీం తదితరులు పాల్గొన్నారు.