Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి నుంచి నామినేషన్లు, ఏప్రిల్ 30న పోలింగ్, మే 3న ఫలితాలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
జీహెచ్ఎంసీ పరిధిలోని ఎల్బీనగర్ జోన్లో లింగోజిగూడ వార్డు ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీచేసింది. రాష్ట్రంలోని ఖమ్మం, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలతోపాటు లింగోజిగూడ వార్డుకు ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. అయితే గతేడాది డిసెంబర్లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 56, బీజేపీ 48, మజ్లీస్ పార్టీ 44, కాంగ్రెస ్పార్టీ రెండు వార్డులో గెలిచిన విషయం తెలిసిందే. లింగోజిగూడ వార్డు నుంచి గెలిచిన ఆకుల రమేష్‌గౌడ్ మృతి చెందారు. దీంతో బీజేపీకి ప్రస్తుతం 47 మంది కార్పొరేటర్లు మాత్రమే ఉన్నారు. ఖాళీ అయిన లింగోజిగూడ వార్డుకు ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించనున్నారు.
నేటి నుంచి నామినేషన్లు శుక్రవారం నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. 18న ఈ ప్రక్రియ ముగియనుంది. 19న నామినేషన్ల పరిశీలన, 20న నామినేషన్ల ఉపసంహరణ అనంతరం బరిలో ఉండే అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు. ఈనెల 30వ తేదీ నుంచి ఉదయం 7 గంటలు మొదలు సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. అనివార్య కారణాలతో రీపోలింగ్ నిర్వహించాల్సి ఉంటే మే 2న నిర్వహిస్తారు. మే 3వ తేదీన ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు.