Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏఎస్‌రావునగర్
కాప్రా సర్కిల్ పరిధిలో ఉన్న యూనిట్లలో భాగంగా ఒక్కో యూనిట్లో 18 మంది మలేరియా సిబ్బంది ఒకరు సూపర్వైజర్తో కలిపి మొత్తం ఒక్క యూనిట్లో 19 మంది మలేరియా సిబ్బంది అలా ఐదు యూనిట్లలో మొత్తం కాప్రా సర్కిల్లోని మలేరియా సిబ్బంది మొత్తాన్ని కలితే 95 మంది 5 డివిజన్లలో కలుపుకొని మలేరియా విభాగంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి మల్లాపూర్, నాచారం, రెండు యూనిట్ల వారు,సూర్యనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. కాప్రాలోని ఫాగింగ్ సిబ్బంది ఏఎల్ఓ టీం, చర్లపల్లి డివిజన్ల వారు కుషాయిగూడ, జమ్మిగడ్డలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ లోకేష్ కుమార్ ఆదేశాల మేరకు కాప్రా సర్కిల్ లోని మలేరియా విభాగంలో విధులు నిర్వహిస్తున్న 90 మంది సిబ్బంది 5 సూపర్వైజర్ లతో కలిపి కాప్రా సర్కిల్ అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్ డి.రమేష్ నేతత్వంలో కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమాన్ని గురువారం నాటికి మొదటి వ్యాక్సిన్ తీసుకున్న కాప్రా సర్కిల్ మలేరియ సిబ్బంది వ్యాక్సిన్ స్వీకరించడం జరిగిందని తెలిపారు. రమేష్ మాట్లాడుతూ సిబ్బందికి కొవిడ్ 19 వ్యాక్సిన్‌పై అనుమానాలపై అవగాహన కల్పిస్తూ కోవిడ్ వ్యాక్సిన్ స్వీకరించే విధంగా కోవిడ్ వాక్సిన్‌పై అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు.