Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్ నుంచి పాల్గొనే ఏకైక మేయర్ విజయలక్ష్మి
నవతెలంగాణ-సిటీబ్యూరో
వాతావరణంలో కర్బన ఉద్గారాలను తగ్గించి నగరాల్లో మెరుగైన జీవన ప్రమాణాలను కల్పించేందుకు చేపట్టాల్సిన చర్యలపై యునైెటెడ్ నేషన్స్ ఇన్ఫర్మేషన్, కమ్యునికేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న గ్లోబల్ మేయర్ల సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి ఆహ్వానం లభించింది. ప్రపంచంలోని 40 నగరాలకు చెందిన మేయర్లకు ఈ వెబ్ ఆధారిత సదస్సులో పాల్గొనేందుకు అవకాశం దక్కింది. భారతదేశం నుంచి హైదరాబాద్ నగర మేయర్‌కు మాత్రమే ఈ అవకాశం లభించింది. ఏప్రిల్ 16న రాత్రి 8.15 గంటల నుంచి 10:15 గంటల వరకు జరిగే ఈ సదస్సులో ఐక్యరాజ్య సమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటారెస్ స్వాగతోపన్యాసం చేస్తారు. ఈ సదస్సు నిర్వహణలో ప్రధాన పాత్ర వహిస్తున్న లాస్ ఏంజెల్స్ మేయర్ ఎరిక్ గర్సెట్టి కూడా అధ్యక్ష స్థానంలో ఉపన్యాసం చేయనున్నారు. కొవిడ్-19 మహమ్మారిని అధిగమించడం, హరిత, పర్యావరణ పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలు, నిర్ధారిత లక్ష్యాలపై మేయర్లు ప్రసంగిస్తారు. వీరితో పాటు యునైటెడ్ నేషన్స్ హ్యాబిటాట్‌కు చెందిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైమూనా మహ్మద్ షరీఫ్ కూడా ప్రసంగించే ఈ సదస్సులో మెల్బోర్, టోకియో, జకార్త, లియోయోడీజినిరో, ప్యారీస్, మిలన్, మాంట్రియల్, బార్సిలోనా, జోహనస్ బర్గ్ తదితర ప్రముఖ అంతర్జాతీయ నగరాల మేయర్లు పాల్గొంటారు. హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా ప్రసంగించనున్నారు.