Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ ప్రధాన కార్యాలయం అయిన రైల్ నిలయంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యాతోపాటు అడిషినల్ జనరల్ మేనేజర్, అరుణ్ కుమార్ జైన్, సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ చంద్రిమారారు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గజానన్ మాల్యా మాట్లాడుతూ.. అంబేద్కర్ గొప్ప దార్శనికత గల వ్యక్తి, సంఘ సంస్కర్త అన్నారు. సమాజంలో వివక్షకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడిన గొప్ప నాయకుడని గుర్తు చేశారు. అంబేద్కర్ సిద్ధాంతాలకు అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే నడుచుకుంటుందని, బహీన వర్గాల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు.