Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్‌నగర్
తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, టీఆర్ఎస్ నాయకుడు చుక్కమెట్టు శ్రీకాంత్ రెడ్డి(50) రోడ్డు ప్రమాదంలో గాయపడి, హాస్పిటల్లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఆయన స్వస్థలం రంగారెడ్డి జిల్లా, కొందుర్గు మండలంలోని ముత్కూరు గ్రామం. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్ని సంవత్సరాల కిందట సిటీకి వచ్చి మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని జడ్జిస్ కాలనీ ఫేస్1లో నివాసం ఉంటున్నారు. మృతుడు టీఆర్ఎస్లో చురుకుగా పాల్గొన్న వ్యక్తి అని, తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఎల్బీనగర్లో చురుకైన పాత్ర పోషించిన వ్యక్తి అని మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి గుర్తు చేశారు. రెండుసార్లు డివిజన్ అధ్యక్షుడిగా కొనసాగారు. ఈనెల 13న టూ వీలర్‌పై ఇంటికి వెళ్తుండగా చిత్రసీమ కాలనీ వద్దకు రాగానే అదుపు తప్పి కింద పడిపోవడంతో గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో గురువారం తుదిశ్వాస విడిచారు. అతను పార్టీలో ప్రతి ఒక్కరితో చనువుగా, మర్యాదగా మాట్లాడే వాడని టీఆర్ఎస్ కార్యకర్తలు పేర్కొన్నారు.