Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్ నగర్
ఈనెల 14 నుండి 20 వరకు ప్రతి ఏటా వేసవిలో ప్రజలకు అగ్నిప్రమాదంపై అవగాహన కల్పించేందుకు గాను అగ్నిమాపక వారోత్సవాలు నిర్వస్తున్నట్లు ఎల్బీ నగర్ శాసన సభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సూచించారు. గురువారం అగ్నిమాపక సిబ్బందితో కలిసి గోడ పత్రికను హయత్ నగర్ ఫైర్ అధికారి శ్రీనయ్యతో కలిసి విడుదల చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్నిమాపక ప్రమాదం జరిగిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముఖ్యంగా చిన్న పిల్లలు వేసవిలో అగ్నిప్రమాదంపై జాగ్రత్తలు అవసరం అన్నారు. ఎక్కడైనా ప్రమాదం జరిగితే 101 లేదా 040-24203108కు సంప్రదించాలి అని ఆయన తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగే దానికన్నా మొదలే జరగకుండా తీసుకునే నివారణ చర్యలు చాలా ముఖ్యమని, అగ్ని ప్రమాదాలు జరగకుండా అన్ని సంస్థల వారు పాఠశాలలు, అపార్ట్మెంట్లు, ఆసుపత్రులు అగ్నిమాపక శాఖ నిబంధనలు పాటించాలని కోరారు. కార్యక్రమంలో టీిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు గజ్జల మధుసూదన్ రెడ్డి, కాలనీల వాసులు తులసి పటేల్, మదన్‌లాల్ పటేల్, గోవింద్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.