Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
'సార్ హైదరాబాద్ చెరువులకు పుట్టినిల్లు. కానీ ఫిల్మ్‌నగర్, షేక్‌పేట్ సమీపంలోని హకీంపేట్ కుంట జీహెచ్ఎంసీ తగ్గించింది. డంపింగ్‌యార్డుగా మార్చింది' అని మంజరినాయుడు అనే సిటిజన్ కేటీఆర్‌కు ట్వీట్ చేసింది. స్పందించిన కేటీఆర్ హకీంపేట ్కుంటను సందర్శించి తనకు రిపోర్ట్ ఇవ్వాలని జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్‌ను ఆదేశించారు. దీంతో జోనల్ కమిషనర్ నేతృత్వంలోని జీహెచ్ఎంసీ అధికారుల బృందం గురువారం హకీంపేట్ కుంటను సంద ర్శించింది. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ ప్రావీణ్య మాట్లాడుతూ... స్థానికులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయం మేరకు హకీంపేట్ కుంటను అభివృద్ధి చేస్తామని, థీమ్పార్కుగా మారుస్తామని తెలిపారు.