Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
నగరంలో గుట్టుచప్పుడు కాకుండా క్రికెట్‌బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను నార్త్‌జోన్ టాస్క్ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.40 వేల నగదు, నాలుగు సెల్పోన్లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం డీసీపీ రాధాకిషన్‌రావు తెలిపిన వివరాల మేరకు సుల్తాన్‌బజార్‌కు చెందిన శరత్ అగర్వాల్, రామ్‌కోఠికి చెందిన అంకిత్, గౌలీగూడ చమన్‌కు చెందిన రోహిత్ అగర్వాల్‌లు ముఠాగా ఏర్పడి క్రికెట్ బెట్టింగ్‌లకు తెరలేపారు. 'డబ్య్లూడబ్య్లూబ్య్లూ. క్రికెట్మజా.కామ్'లో ఆన్లైన్ ఐడీని తీసుకున్నారు. రామ్కోఠీలో గుట్టుచప్పుడు కాకుండా ఆన్లైన్లోనే క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. ఐపీఎల్ మ్యాచ్‌లపై సైతం బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు.ముంబాయిలో 'రాజస్తాన్రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్' జట్లమధ్య జరిగిన మ్యాచ్‌లపై బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారని సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ కే.నాగేశ్వర్రావు నిందితులను అరెస్టు చేశారు. క్రికెట్ బెట్టింగ్‌లపై ప్రత్యేక నిఘా ఉంచామని డీసీపీ తెలిపారు.