Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
అక్రమంగా నల్లా కనెక్షన్ తీసుకున్న యజమానితోపాటు అందుకు సహకరించిన జలమండలి మాజీ వర్క్ ఇన్స్పెక్టర్పై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. గురువారం జలమండలి అధికారులు తెలిపిన వివరాల మేరకు రాజేంద్రనగర్ పరిధిలోని శివసాయి కాలనీలో నివాసముంటున్న వెంకటేష్, జలమండలి అధికారుల అనుమతి లేకుండా అక్రమంగా నల్లా కనెక్షన్ తీసుకున్నారు. అయితే 2009 సంవత్సరానికి ముందు మంచినీటి సరఫరా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో జరుగుతుండేది. తర్వాత జలమండలి బుద్వేల్ సెక్షన్ ఏర్పడడంతో జీహెచ్ఎంసీ నుంచి వచ్చిన ఆంజనేయులు జలమండలి వర్క్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించాడు. (ప్రస్తుతం ఆయన జీహెచ్ఎంసీ రాజేంద్రనగర్ కార్యాలయంలో పనిచేస్తున్నారు.) వర్క్ ఇన్స్పెక్టర్గా ఆంజనేయులు విధులు నిర్వహిస్తున్న సమయంలో అక్రమ కనెక్షన్లకు సహకరించాడు. తాజాగా జలమండలి విజిలెన్స్ అధికారులు నిర్వహించిన తనిఖీలో వెలుగు చూడడంతో సంబంధిత యజమాని వెంకటేష్‌తోపాటు ఆంజనేయులుపై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో అధికారులు ఫిర్యాదు చేశారు. అన్ని కోణాల్లో పరిశీలించిన పోలీసులు ఇద్దరిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అనుమతులు లేకుండా అక్రమ నల్లా కనెక్షన్లు తీసుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జలమండలి అధికారులు హెచ్చరించారు.