Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మలక్పేట్
మహిళలను మభ్యపెట్టి వ్యభిచార గృహాలకు విక్రయిస్తున్న వ్యక్తిపై పోలీసులు పీడీయాక్ట్ నమోదు చేసిన ఘటన సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ విశాఖ పట్టణానికి చెందిన పోకల లింగయ్య, బత్తిని మానస, వల్లపు మల్లికార్జున్ ముగ్గురూ ఒక ముఠాగా ఏర్పడ్డారు. వీరు కాలేజీ విద్యార్థినులను, మహిళలను లక్ష్యంగా చేసుకుని హ్యూమన్ ట్రాఫికింగ్ నెట్వర్క్ వలలో పడవద్దని వారితో నమ్మబలికే వారు. ఆంధ్ర ప్రదేశ్, ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేవారు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో విద్యార్థినులను, మహిళలను ట్రాప్ చేసి వారిని వ్యభిచార గహాలలో విక్రయించేవారు. సమాచారం తెలుసుకున్న రాచకొండ కమిషనరేట్ పరిధి ఎస్స్వోటీ, సరూర్ నగర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. పోలీసులు నిర్వహించిన ఆపరేషన్లో జనవరి 8వ తేదీన వ్యభిచార కూపంలో దిగిన ఓ మహిళను అరెస్టు చేయగా వీరి గుట్టు రట్టయింది. ఈ కేసులో పోకల లింగయ్యను అరెస్ట్ చేసి, పీడీ యాక్ట్ నమోదు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. లింగయ్యతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు బత్తిని మానస, వల్లపు మల్లికార్జునపై గతంలో పీడీయాక్ట్ కేసులు నమోదు అయ్యాయని పోలీసుల తెలిపారు.