Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన నాంపల్లి పోలీసులు
- శభాష్ అని మెచ్చుకున్న సీపీ
నవతెలంగాణ-సిటీబ్యూరో
నాంపల్లి రైల్వేస్టేషన్ ముందు బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు పెద్ద లగేజీ బ్యాగ్‌లతో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. అటుగా వెళ్తున్న ఒక ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లకు వారిపై డౌట్ రావడంతో అపారు. తనిఖీ చేయడంతో వారు గంజాయి స్మగ్లర్లుగా తేలారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించిన కానిస్టేబుళ్లు ఇద్దరు నిందితులను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ముంబరుకు చెందిన ప్రీతీ ప్రదీప్ మండల్, రాజారామ్ స్వామీ కన్ను పాడియాచీలు కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చారు. తిరుగు ప్రయాణంలో భాగంగా ముంబాయికి వెళ్లేందుకు బుధవారం రాత్రి 10 గంటల సమయంలో రెండు పెద్దబ్యాగ్లతో నాంపల్లి రైల్వేస్టేషన్ ముందునుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. అదే సమయంలో నాంపల్లి పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్ఐ జే.సుధీర్, కానిస్టేబుళ్లు బి.వెంకటేశ్, ఆబిద్ హుస్సేన్ పెట్రోలింగ్‌లో భాగంగా అక్కడి నుంచి వెళ్తున్నారు. నడుచుకుంటూ వెళ్తున్న ఆ ఇద్దరిపై అనుమానం రావడంతో వారిని ఆపారు. భయపడిన ఇద్దరు నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు అప్రమత్తమై వెంటనే వారిని అరెస్టు చేసి నాంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎస్‌హెచ్‌వో ఎండీ ఖలీల్ అన్ని కోణాల్లో విచారించారు. ఘరానా స్మగ్లర్లుగా తేల్చారు. వారి వద్దగల బ్యాగ్‌లను తెరిచి చూడడంతో అందులో 38కిలోల గంజాయి బయటపడింది. గంజాయి విలువ రూ.19,20,000 ఉంటుందని సీపీ తెలిపారు. విషయం తెలుసుకున్న నగరపోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సీఐతోపాటు ఎస్ఐ, కానిస్టేబుళ్లను ప్రత్యేకంగా అభినందించారు. తన కార్యాలయానికి పిలిపించుకుని మెమోంటోను అందజేశారు.