Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.7.21లక్షలకే ట్రాక్టర్ లభ్యం
- ఇండియాలో మొట్టమొదటి సారి బూస్టును పరిచయం చేసిన ఐటీఎల్
నవతెలంగాణ-సిటీబ్యూరో
ట్రాక్టర్ పరిశ్రమలో మరోమారు విప్లవాత్మక సాంకే తికతల ఆవిష్కరణలో అగ్రగామిగా నిలుస్తూ ఇంటర్నే షల్ ట్రాక్టర్స్ లిమిటెడ్ (ఐటీఎల్) తమ అత్యాధునిక సోలీస్ హైబ్రిడ్ 5015 ట్రాక్టర్‌ను జపనీస్ హైబ్రిడ్ సాంకేతికతతో అసాధారణ ధర రూ.7.21లక్షలు (ఎక్స్‌షోరూమ్, ఇండియా) వద్ద విడుదల చేసింది. భారతదేశపు అత్యంత వేగంగా వద్ధి చెందుతున్న ట్రాక్టర్ తయారీదారు, నెంబర్1 ఎగుమతి బ్రాండ్ ఐటీఎల్ ఈ నూతన సాంకేతిక అద్భుతాన్ని జపనీస్ భాగస్వామి యన్మార్ అగ్రిబిజినెస్ కో లిమిటెడ్ భాగస్వామ్యంతో తీర్చిదిద్దింది. మూడు ట్రాక్టర్ల ప్రయోజనా సోలీస్లను ఒకే ట్రాక్టర్లో దీని ద్వారా పొందవచ్చు. భారతదేశంలో ఈ పవర్ బూస్ట్‌ను పరిచయం చేసిన మొట్టమొదటి ట్రాక్టర్ తయారీదారు ఐటీఎల్. నూతన సోలీస్ హైబ్రిడ్ 5015 ట్రాక్టర్ ఆవిష్కరణతో ఐటీఎల్ ఇప్పుడు సోలీస్ యన్మార్ యొక్క స్థానాన్ని 4వీ డ్రైవ్ ట్రాక్టర్ ఎక్స్‌పర్ట్స్‌గా నిలుపడం లక్ష్యంగా చేసుకుంది.నూతన 50హెచ్‌పీ సోలీస్ హైబ్రిడ్ 5015 ట్రాక్టర్ అనుకూలీకరించిన ఉత్పత్తి. ఇది సంప్రదాయ డీజిల్ ఇంజిన్ శక్తిని విద్యుత్ శక్తితో మిళితం చేయడంతో పాటుగా స్థిరమైన పనితీరు, అత్యధిక వేగంను 60 హెచ్‌పీ ట్రాక్టర్‌లా అందిస్తుంది.